Reading Time: 2 minutes
Mahesh Babu Vs Ranbir Kapoor Clash Of Mythological Films In Indian Cinema

టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా గుర్తింపున్న మహేశ్ బాబు ఇప్పటివరకు ఎక్కువగా మాస్, క్లాస్ కమర్షియల్ సినిమాల్లోనే కనిపించాడు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు మాత్రం చాలా డిఫరెంట్. వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో ఒక భారీ గ్లోబల్ సినిమా ఆ కథలో రాముడి విలువలు, ధర్మం, ఆధ్యాత్మికత ప్రధానంగా ఉంటాయని టాక్.  మహేశ్ బాబు కెరీర్‌లో ఇది పూర్తిగా కొత్త అవతారం అవుతుంది. క్లీన్ ఇమేజ్, రాయల్ లుక్స్ ఇవన్నీ రాముడి క్యారెక్టర్‌కు బాగా సెట్ అవుతాయని చాలా మంది భావిస్తున్నారు.  ఇప్పటికే ఎస్ ఎస్ రాజమౌళి సినిమా ద్వారా మహేశ్ బాబు గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో రాముడి కాన్సెప్ట్ సినిమా వస్తే అది కేవలం టాలీవుడ్ మూవీ కాకుండా పాన్ వరల్డ్ మైథలాజికల్ డ్రామాగా మారే అవకాశం ఉంది. దేవాలయాల నగరం వారణాసి ఆధ్యాత్మిక నేపథ్యం మహేశ్ బాబు స్టైల్ ఇవన్నీ కలిస్తే సౌత్ నుండి మరో భారీ విజువల్ ఫీస్ట్ కావచ్చునని విశ్లేషకుల మాట.

Also Read : Lavanya Tripathi : మెగా కోడ‌లికి త‌ప్ప‌ని సోషల్ మీడియా వేధింపులు..

ఇక బాలీవుడ్‌లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న మైథలాజికల్ సినిమా రామాయణ. దర్శకుడు నితేష్ తివారి రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో రణభీర్ కపూర్ నటిస్తున్నాడు. ఇప్పటికే మొదటి భాగం పూర్తవగా ఇప్పుడు ముంబైలో రెండో భాగం షూటింగ్ మొదలైంది.  మే వరకు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అలాగే హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ , సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్న ఈసినిమా 2026 దీపావళికి ఫస్ట్ పార్ట్ , 2027 దీపావళికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం అంటే భారతీయ సంస్కృతికి ప్రతీక. అలాంటి కథలో రాముడి పాత్ర పోషించడం రణబీర్ కపూర్ కెరీర్‌లో అత్యంత కీలకమైన అడుగు. ఇప్పటికే ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపించాడు ఆయనను రాముడి పాత్రలో ఆసక్తిగా మలచడం లో బాలీవుడ్ మేకర్స్ వైఫల్యం చెందారు.

దాంతో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ ఏంటంటే. ఒక వైపు బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్ రాముడి పాత్రలో రామాయణ మరోవైపు సౌత్ నుంచి మహేశ్ బాబు రాముడి ఇమేజ్‌తో వస్తోన్న వారణాసి. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ గ్లోబల్ మార్కెట్ టార్గెట్. ఇద్దరూ స్మార్ట్ హీరోలే దాంతో ఇప్పటి నుంచే ఒక ప్రశ్న వినిపిస్తోంది. రాముడిగా పర్ఫెక్ట్ చివరికి బాక్సాఫీస్ దగ్గర విజేతగా నిలబడేదెవరు? అన్న డిస్కషన్ హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ చర్చ మాత్రం సోషల్ మీడియాలో ఆగేలా కనిపించడం లేదు.