Reading Time: 2 minutes
Ishan Kishan Girlfriend Who Is Model Aditi Hundia Age Career Love Story

Ishan Kishan Girlfriend: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ ఇషాన్ కిషన్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ICC T20 World Cup ఫైనల్ సందర్భంగా అతని గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ సమయంలో స్టాండ్స్‌లో నుంచి ఇషాన్‌కు ఆమె ఉత్సాహంగా మద్దతు ఇస్తూ కనిపించింది. ఇక, భారత్ విజయం అనంతరం ఇషాన్ కిషన్ తన లేడీ లవ్‌కు ముద్దు పెట్టుకోవడం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో సోషల్ మీడియాలో అదితి హుండియా గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో ఇషాన్‌ కిషన్‌ మనసు దోచిని అదితి హుండియా ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అనే చర్చ సాగుతుండగా.. ఆమెది జైపూర్‌.. ఆమె వృత్తిరీత్యా మోడల్ మరియు ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె తండ్రి జైపూర్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఫ్యాషన్ ప్రపంచంలో అదితి తన అందం, స్టైల్ మరియు ఆకర్షణీయమైన చిరునవ్వుతో మంచి గుర్తింపు సంపాదించింది. అదితి 2018లో జరిగిన మిస్‌ దివా 2018 పోటీలో విజేతగా నిలిచింది. అంతకుముందు Femina Miss India పోటీలో ఫైనలిస్ట్‌గా కూడా నిలిచింది. ఆ తరువాత ఆమె ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టి అనేక మోడలింగ్ ప్రాజెక్టుల్లో పాల్గొంది.

అంతేకాదండోయ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు సుమారు 3.7 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మాత్రమే కాకుండా కంటెంట్ క్రియేటర్‌గా కూడా ఆమె మంచి గుర్తింపు పొందింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అదితి ఒక వ్యాపారవేత్త కూడా. ఆమెకు స్వంతంగా ఒక ఫ్యాషన్ లేబుల్ ఉంది. అదితి St. Xavier’s College నుంచి BBA డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ మరియు ఫ్యాషన్ షోలలో పాల్గొంటూ కెరీర్‌ను ప్రారంభించింది.

అదితి ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ నటించిన “Tootey Khaab” మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. 2019 ఐపీఎల్ సమయంలో ఇషాన్ కిషన్‌తో లింక్‌ పెడుతూ వార్తల్లో లిచింది అదితి హుండియా.. అప్పటి నుంచే వీరి ప్రేమకథ ప్రారంభమైనట్లు ప్రచారం జరిగింది. మీడియా కథనాల ప్రకారం, అదితి హుండియా ఇషాన్ కిషన్ కంటే ఏజ్‌లో కాస్త పెద్దది. ప్రస్తుతం ఇషాన్ వయసు 27 సంవత్సరాలు కాగా, అదితి వయసు 29 సంవత్సరాలు. వీరి జంటను అభిమానులు సోషల్ మీడియాలో “Made for Each Other” అంటూ ప్రశంసిస్తున్నారు. మరి వీరి మధ్య లవ్‌ ఉందా.. అది పెళ్లి పీటల వరకు వెళ్తుందా అనేది మాత్రం వేచి చూడాలేమో..