July 9, 2026

Ahmed Shehzad: మేము కెన్యా, ఉగాండాను మాత్రమే ఓడించాం.. భారత్ పై గెలవలేమన్న పాక్ మాజీ క్రికెటర్ 

Ahmed Shehzad: మేము కెన్యా, ఉగాండాను మాత్రమే ఓడించాం.. భారత్ పై గెలవలేమన్న పాక్ మాజీ క్రికెటర్ 
Reading Time: 2 minutes

Ahmed Shehzad: మేము కెన్యా, ఉగాండాను మాత్రమే ఓడించాం.. భారత్ పై గెలవలేమన్న పాక్ మాజీ క్రికెటర్ 

Caption of Image.

Ahmed Shehzad: 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతుండగా, పాకిస్తాన్‌లో మాత్రం ఈ గెలుపు తీవ్ర చర్చకు దారితీసింది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్ గెలవడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహ్జాద్ తమ దేశ క్రికెట్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  “హార్నా మానా హై” కార్యక్రమంలో మాట్లాడిన షెహ్జాద్.. భారత్ విజయానికి కారణం వారి బలమైన క్రికెట్ వ్యవస్థ.. టీమిండియాలో ప్రతిభతో పాటు సరైన సిస్టమ్ ఉండటంతో కొత్త ఆటగాళ్లు ముందుకు వస్తున్నారని చెప్పారు. కానీ పాకిస్తాన్‌లో ప్రతిభకు కొరత లేదు.. మా సిస్టమ్‌లోనే సమస్య ఉందన్నారు.  

భారత ఆటగాళ్లపై ప్రశంసలు: 
సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను అహ్మద్ షెహ్జాద్ ఉదాహరణగా చూపించాడు. టోర్నీలో పెద్దగా అవకాశాలు రాకపోయినా, వచ్చిన ఛాన్స్ ని వారు అద్భుతంగా ఉపయోగించుకున్నారని తెలిపాడు. శాంసన్ ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలవడం చాలా గొప్ప విషయం అన్నారు. అలాగే ఫైనల్లో ఒత్తిడిని జయించి అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడని అతడు ప్రశంసించారు. కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి మ్యాచ్‌ స్వరూపన్నే మార్చేశాడని పేర్కొన్నాడు.  

►ALSO READ | Dhoni– Gambhir: మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది.. ధోనీ పోస్ట్‌పై గంభీర్ రియాక్షన్

పాక్ క్రికెట్‌పై వ్యంగ్యం: 
భారత్ జట్టు పెద్ద జట్లతో సిరీస్‌లు ఆడుతూ మెరుగవుతుంటే, పాకిస్తాన్ మాత్రం జింబాబ్వే, కెన్యా, ఉగాండా వంటి జట్లపై గెలిచినప్పుడే ఎక్కువగా సంబరాలు చేసుకుంటుందని అహ్మద్ షెహ్జాద్ విమర్శలు గుప్పించాడు.  భారత్ 250 పరుగుల లక్ష్యంతో ఆడుతుంది, కానీ పాకిస్తాన్ అయితే 180 పరుగులు చేస్తే సరిపోతుందని భావించి బౌలర్లపై ఆధారపడుతుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా, న్యూజిలాండ్ చివర్లో అడ్డుకోకపోయింటే.. భారత్ స్కోరు 275 వరకు వెళ్లే ఛాన్స్ ఉండేదని తెలిపారు. పాకిస్తాన్‌కు ఒక ప్రత్యేక ర్యాంకింగ్ పెట్టాలి.. అందులో కేవలం కెన్యా, ఉగాండా, జింబాబ్వే లాంటి జట్లే ఉండాలంటూ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహ్జాద్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
 

©️ VIL Media Pvt Ltd.