Reading Time: < 1 minute

లెబనాన్‌పై ఇజ్రాయెల్ కెమికల్ దాడి: నిప్పుల వర్షం కురిపిస్తూ ఇళ్లను తగలబెడుతున్న సైన్యం….

Caption of Image.

పశ్చిమాసియా (Middle East) యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ  ఆరోపించింది. దక్షిణ లెబనాన్‌లోని ప్రజలు నివసించే ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైట్ ఫాస్ఫరస్ అనే ప్రమాదకరమైన రసాయన ఆయుధాలను ప్రయోగించిందని పేర్కొంది.

వివరాల ప్రకారం…  మార్చి 3న దక్షిణ లెబనాన్‌లోని యోహ్మోర్ అనే పట్టణంలో ఇజ్రాయెల్ సైన్యం ఫిరంగి గుండ్లను ప్రయోగించింది. ఇవి సాధారణ బాంబులు కావు, గాలిలోనే పేలి మంటలను వెదజల్లే రసాయన గుండ్లు. ఈ దాడిలో రెండు ఇళ్లు, ఒక కారు తగలబడ్డాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను హ్యూమన్ రైట్స్ వాచ్ పరిశీలించి నిజమేనని నిర్ధారించింది.

వైట్ ఫాస్ఫరస్ అంటే ఏంటి ?  ఎంత ప్రమాదకరం?
వైట్ ఫాస్ఫరస్ ఒక రకమైన రసాయన పదార్థం. దీని ప్రత్యేకతలు, దీని వల్ల  ప్రమాదాలు చూస్తే  ఆక్సిజన్ తగలగానే భయంకరంగా మండుతుంది. ఇది గాలిలో పేలినప్పుడు వందలా చిన్న చిన్న నిప్పుకణికల్లా మారి పెద్ద విస్తీర్ణంలో పడుతుంది. ఇది మనుషుల చర్మంపై పడితే ఎముకల వరకు కాల్చేస్తుంది. దీనివల్ల వచ్చే గాయాలు జీవితాంతం బాధిస్తాయి లేదా మరణానికి దారితీస్తాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. సైనిక అవసరాలకు దీన్ని వాడవచ్చు కానీ, ప్రజలు నివసించే చోట వాడటం నేరం.

ఇజ్రాయెల్ హెచ్చరికలు – తరలిపోతున్న ప్రజలు
ఒకవైపు ఈ దాడులు జరుగుతుండగానే, ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ రాజధాని బీరుట్ సమీపంలోని ప్రజలను ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హెచ్చరించింది. హిజ్బుల్లా స్థావరాలపై దాడులు పెంచుతామని సంకేతాలిస్తూ, ప్రజలు ఉత్తర లేదా తూర్పు ప్రాంతాలకు వెళ్లాలని మ్యాప్‌ కూడా విడుదల చేసింది.

►ALSO READ | హాస్పిటల్స్ ఏం పాపం చేశాయని.. ఇరాన్లో 25 హాస్పిటల్స్పై బాంబులు వేసిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2023లో గాజా – లెబనాన్ సరిహద్దుల్లో కూడా ఇజ్రాయెల్ ఈ వైట్ ఫాస్ఫరస్ వాడిందని హ్యూమన్ రైట్స్ వాచ్ గతంలోనే ఆరోపించింది. అయితే అప్పట్లో ఇజ్రాయెల్ ఆ వార్తలను ఖండించింది.

©️ VIL Media Pvt Ltd.