Reading Time: 2 minutes
Top 5 Best Mileage Bikes In India 2026 Under Budget Hf Deluxe Splendor Plus Platina 100 And More

Best Mileage Bikes: భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు బైక్ అనేది కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు. ఖర్చులను అదుపులో ఉంచే ఓ మంచి మార్గం కూడా. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో బైక్ కొనేటప్పుడు ఎక్కువ మంది ముందుగా అడిగే ప్రశ్న “మైలేజీ ఎంత ఇస్తుంది?” అని. అలాంటి వారికి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందించే కొన్ని బైకులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల అమలులోకి వచ్చిన GST 2.0 సంస్కరణల వల్ల 350cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై పన్ను 28% నుండి 18%కి తగ్గింది. దీంతో ఈ బైకుల ధరలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు 2026లో భారత మార్కెట్‌లో ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 5 బైకుల వివరాలు చూద్దాం.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe):
ఈ హీరో బైక్ భారత మార్కెట్‌లో అత్యంత నమ్మకమైన, తక్కువ ధరలో లభించే వాటిలో ఒకటి. ఈ బైక్ ధర 55,992 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ బండి లీటరుకు సుమారు 70 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఇందులో 97.2cc ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రఫ్ అండ్ టఫ్ వాడకానికి ఇది బాగా సరిపోతుంది. అంతేకాదు దీనికి మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ.

Hardik Pandya: నా సక్సెస్‌కు కారణం ఆమె.. ఇంకా పదేళ్లు ఆడుతా, పది ట్రోఫీలు గెలుస్తా!

టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport):
స్టైలిష్ లుక్‌తో పాటు మంచి మైలేజీ కావాలనుకునే వారికి టీవీఎస్ స్పోర్ట్ మంచి ఎంపిక. దీనిని టీవీఎస్ మోటార్ కంపెనీ తయారు చేస్తోంది. ఈ బైక్ ప్రారంభ ధర సుమారు 55,500 ఉంటుంది. ఇదిలీటరుకు 70 నుంచి 75 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఇందులో 109.7cc ET-Fi ఇంజన్ ఉంటుంది. సుదూర ప్రయాణాలలో కూడా ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ బైక్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించింది.

హోండా షైన్ 100 (Honda Shine 100):
100cc సెగ్మెంట్‌లో తన స్థానాన్ని బలపరచడానికి హోండా తీసుకొచ్చిన బైక్ హోండా షైన్ 100. దీని ధర రూ. 63,191 నుండి మొదలవుతుంది. లీటరుకు 65 నుంచి 68 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ బరువు కేవలం 99 కిలోలే కావడంతో సిటీ ట్రాఫిక్‌లో నడపడం చాలా సులభం. ఇందులో హోండా కంపెనీకి చెందిన నమ్మకమైన PGM-Fi ఇంజన్ టెక్నాలజీ ఉపయోగించారు.

హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus):
భారతదేశంలో దశాబ్దాలుగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ప్రస్తుతం దీని ధర సుమారు 59,126 నుండి మొదలవుతుంది. ఇతర బైకులతో పోలిస్తే ధర కొంచెం ఎక్కువైనా, దీని రీసేల్ వాల్యూ చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న i3S టెక్నాలజీ ట్రాఫిక్‌లో వాహనం ఆగినప్పుడు ఇంజన్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేస్తూ పెట్రోల్‌ను ఆదా చేస్తుంది.

Petrol-Diesel price: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. వదంతులపై కీలక ప్రకటన!

బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100):
సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రసిద్ధి చెందిన బైక్ బజాజ్ ప్లాటినా 100. దీన్ని బజాజ్ ఆటో తయారు చేస్తోంది. దీని ధర సుమారు రూ. 66,015 నుండి ప్రారంభమవుతుంది. లీటరుకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. 102cc DTS-i ఇంజన్‌తో వచ్చే ఈ బైక్ గుంతల రోడ్లపై కూడా సాఫ్ట్ రైడ్ అందిస్తుంది. ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది.