Reading Time: < 1 minute
Hardik Pandya Introduces Girlfriend Mahika Sharma As Mrs After Indias T20 World Cup 2026 Win

Hardik Pandya: సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఘన విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇన్బకా జరుగుతూనే ఉన్నాయి కూడా. అయితే ఈ విజయానంతరం హార్దిక్ పాండ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఓ యాంకర్ తో మాట్లాడిన హార్దిక్ పాండ్య.. తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అనుకున్నది సాధిస్తారు!

హార్దిక్ మాట్లాడుతూ.. తన గర్ల్‌ఫ్రెండ్ మహిక శర్మ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆమె తన జీవితంలోకి వచ్చిన తర్వాత వరుస విజయాలు వస్తున్నాయని.. ఆమె రావడంతో తన జీవితంలో చాలా మంచి మార్పులు సంభవించాయని పేర్కొన్నాడు. అంతేకాకుండా కాస్త భావోద్వేగంగా స్పందించాడు. ఆమెను చూపిస్తూ “తనే నా మిసెస్” అని అన్నాడు. నిజానికి ‘మిసెస్’ అనే పదాన్ని భార్యకు మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి.. పాండ్య చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆనందాన్ని పంచాయి.

World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..

ఇంటర్వ్యూ అనంతరం హార్దిక్ పాండ్యను కలిసిన మాహిక శర్మ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అతన్ని ఆలింగనం చేసుకొని, ముద్దు పెట్టి అభినందించింది. ఇందుకు సమబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాగే పాండ్య భవిష్యత్ లక్ష్యాల గురించి కూడా మాట్లాడాడు. రాబోయే 10 సంవత్సరాలు క్రికెట్ ఆడాలని తన లక్ష్యమని చెప్పాడు. అంతేకాదు మరో 5 – 6 ట్రోఫీలు గెలుచుకోవాలని కూడా అనుకున్నట్లు తెలిపాడు. 2024 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ బార్బడోస్‌ లో గెలిచిన తర్వాత ప్రతి టోర్నమెంట్‌లో ట్రోఫీ సాధించాలని తనతో తానే మాట ఇచ్చుకున్నానని అన్నారు. ఇక ఈ సిరీస్ లో హార్దిక్ పాండ్య అద్భుత ప్రదర్శన చేశాడు. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన అతను 217 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు కూడా తీశాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.