Reading Time: < 1 minute

ఇండియన్లు బాధ్యతగా  వ్యవహరిస్తున్నరు

Caption of Image.
  • అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్‌‌‌‌‌‌‌‌ బెసెంట్ 

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌: రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడంలో భారత్ వ్యవహరించిన తీరుపై అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడంలో భారతీయులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ఈ మేరకు ఫాక్స్ బిజినెస్ చానల్‌‌‌‌‌‌‌‌కు స్కాట్‌‌‌‌‌‌‌‌ బెసెంట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఇండియన్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఆంక్షలు విధించిన రష్యా చమురును కొనుగోలు చేయొద్దని గతేడాది చివరలో భారత్‌‌‌‌‌‌‌‌ను మేం కోరాం.

వారు మా మాటను గౌరవించి వెంటనే కొనుగోళ్లు నిలిపివేశారు. రష్యాకు బదులుగా అమెరికా చమురును దిగుమతి చేసుకునేందుకు కూడా వారు అంగీకరించారు. భారత్ మాకు అత్యంత నమ్మకమైన భాగస్వామి. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో చమురు ధరలు పెరగకుండా ఉండేందుకు భారత్‌‌‌‌‌‌‌‌కు ఈ  మినహాయింపు ఇచ్చాం”  అని పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.