
Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 19న ఉగాది కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. తాజాగా విడుదలైన ఒక ఫోటోలో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ స్టూడియోలో మైక్ ముందు కూర్చుని కనిపిస్తున్నారు. ఆయన పక్కనే దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. “పవర్ స్టార్ డబ్బింగ్ పనులు ప్రారంభించారు” అంటూ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
READ ALSO: CM Revanth Reddy: 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు
“మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఈరోజు ఎప్పుడైనా రావచ్చు.. సిద్ధంగా ఉండండి” అంటూ చిత్ర బృందం ఇచ్చిన హింట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అది సినిమా ట్రైలర్ గురించి అయి ఉంటుందా? లేక ఏదైనా అదిరిపోయే సాంగ్ రిలీజ్ గురించా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి మార్చి 26న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా, యష్ ‘టాక్సిక్’ వాయిదా పడటంతో వారం ముందే థియేటర్లలోకి రాబోతుంది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధూరంధర్ 2’తో ఈ చిత్రం క్లాష్ అయ్యే అవకాశం ఉన్నా, పవన్ కళ్యాణ్ మేనియా ముందు అది నిలబడటం కష్టమేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా.. పార్థిబన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, తమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
Power Star @PawanKalyan begins dubbing for #UstaadBhagatSingh
Post-production in full swing with Cult Captain @harish2you supervising it and @MusicThaman working to deliver a terrific score
The surprise you have been waiting for will drop anytime today…stay tuned
… pic.twitter.com/jHAggidTlV
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 7, 2026


…