Reading Time: 2 minutes
Motorola Edge 70 Fusion Launched In India Price Specifications Sony Lytia Camera 7000mah Battery

Motorola Edge 70 Fusion Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ఎడ్జ్ సిరీస్‌ను మరింతగా పెంచుతూ.. మోటోరోలా (Motorola) భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (Motorola Edge 70 Fusion)ను అధికారికంగా లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, AI ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఇందులో క్వాడ్ కర్వ్ డిజైన్ ఇచ్చారు. ముందు గ్లాస్ వెనుక ప్యానెల్‌తో కలిసేలా ఉండటం వల్ల ఫోన్‌కు స్మూత్ లుక్ వస్తుంది.

India Playing XI: అభిషేక్ విషయంలో కోచ్, కెప్టెన్ సంచలన నిర్ణయం.. టీమిండియా తుది జట్టు ఫిక్స్‌!

ఈ ఫోన్ ఫాంటోన్ బ్లూ సర్ఫ్, ఫాంటోన్ కంట్రీ ఎయిర్, ఫాంటోన్ సీల్ హౌట్టే అనే ప్రత్యేక రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ IP68+IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i డిస్‌ప్లే ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్‌లో కొత్త కెమెరా సిస్టమ్‌ను అందించారు. ముఖ్యంగా సోనీ LYTIA 710 సెన్సర్ ఉన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ లలో ఇది ఒకటి. ఇందులో 50MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్), 13MP అల్ట్రా వైడ్ + మాక్రో లెన్స్ (122° ఫీల్డ్ ఆఫ్ వ్యూ), 32MP ఫ్రంట్ కెమెరాలు ఉంటూ 4K వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తాయి. AI ఆధారిత మోటో ఏఐ & ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ చిత్రాలను మరింత స్పష్టంగా చేయడంలో సహాయపడతాయి.

Image (2)

ఇంకా ఈ కొత్త మోటోరోలా మొబైల్ లో 6.78 అంగుళాల 1.5K ఎక్స్ట్రీమ్ OLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఫాంటోన్ వాలిడేటెడ్ కలర్ అందిస్తుంది. ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్, Hi-Res ఆడియో సపోర్ట్ అందించారు. ఇంకా ఇందులో స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇక ఇందులో 7000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 52 గంటల వరకు పని చేస్తుంది. దీనికి 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

ధరలు:
* 8GB + 128GB – రూ. 26,999

* 8GB + 256GB – రూ. 29,999

* 12GB + 256GB – రూ. 32,999
ఈ ఫోన్ మార్చి 12 నుంచి ఫ్లిప్కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌గా రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు.

Image (3)