Reading Time: < 1 minute

Health Tips : చుండ్రు వేధిస్తుందా.. జట్టును పాడు చేస్తుందా..ఇంటి చిట్కాలతో చుండ్రుకు చెక్..!

Caption of Image.

చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో చుండ్రు ఒకటి.  తలపై తెల్లిటి పొరలా కనిపించే ఈ చుండ్రు వల్ల దురద, అసౌకర్యం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే చాలామంది దీనికి త్వరగా పరిష్కారం కావాలని అనుకుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. .  

 వేడి వాతావరణంలో ఎక్కువ సమయం ఉండటం, పోషకాహార లోపం, ఒత్తిడి వంటి పలు కారణాల వల్ల చాలామందిలో చుండ్రు సమస్య తలెత్తుంది.  ఇది తలపై చర్మం పొరలుగా ఊడిపోవడాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా ప్రమాదకరమైనది కానప్పటికీ, తరచుగా చికాకు మరియు ఇబ్బందిని కలిగిస్తుంది.

  •  కొన్ని మందార పువ్వులను తీసుకుని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. అది కొంచెం వేడిగా ఉండగానే పువ్వులను పిండేయాలి. అప్పుడు పువ్వుల్లో ఉండే సారంనూనెలోకి వస్తుంది. తర్వాత ఆ నూనె చల్లార్చి వాడితే చుండ్రు పోతుంది. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.
  •  ఒక పాత్రలో నీళ్లు పోసి కొన్ని గులాబీ రేకులు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీళ్లను తలకు పట్టించాలి. ముప్పై నిమిషాలు ఆగి తలస్నానం చెయ్యాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య త్వరగా తగ్గుతుంది.
  •  నాలుగు కప్పుల వేడి నీళ్లలో రెండు గుప్పెళ్లు వేపాకులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆకులను తీసేసి ఆ నీటిని తలకు రాసుకోవాలి. ముప్పై నిమిషాలు తర్వాత తలస్నానం చెయ్యాలి. వారంలో మూడు సార్లు ఇలాచేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేపాకులను మెత్తగా నూరి పేస్ట్​ చేసి దాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత తల స్నానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల చుండ్రు త్వరగా తగ్గుతుంది.      

►ALSO READ | జ్యోతిష్యం:  ప్రతి పనిలో ఆటంకాలు.. అవమానాలు.. ఎందుకు కలుగుతాయి… ఎలాంటి పరిహారాలు చేయాలి..!

©️ VIL Media Pvt Ltd.