Reading Time: < 1 minute

Srinivasa Mangapuram: శరవేగంగా అజయ్ భూపతి-జయ కృష్ణ మూవీ.. తిరుపతి షెడ్యూల్పై క్రేజీ అప్డేట్

Caption of Image.

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’.  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా థడానీ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కీలకమైన  మూడో షెడ్యూల్‌‌ తిరుపతిలో సక్సెస్‌‌ఫుల్‌‌గా పూర్తయినట్టు మేకర్స్ తెలియజేశారు.

ఈ షెడ్యూల్‌‌లో  జయ కృష్ణ, రాషా తడానితోపాటు ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తవడంతో  దాదాపు 60 శాతం షూటింగ్  పూర్తయిందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోందని టీమ్ చెప్పింది.  మోహన్‌‌బాబు  కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి  జీవీ ప్రకాష్ కుమార్  సంగీతం అందిస్తున్నాడు.

©️ VIL Media Pvt Ltd.