Reading Time: < 1 minute
India Fuel Crisis Management Lpg Production Boost Russia Us Imports

LPG Production: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ఇంధనరంగ సంక్షోభానికి కారణం కాబోతోంది. ఇప్పటికే ఇరాన్ చమురు రవాణాకు కీలకమైన ‘‘ హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. పెట్రోల్, LPG వంటి పెట్రోలియం నిల్వలు ప్రస్తుతం దేశంలో సరిపడా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also: Water Supply: హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్.. ఈ ఏరియాల్లోనే..

అయినప్పటికీ సంక్షోభం తలెత్తే అవకాశం ఉండటంతో దేశంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ LPG శుద్ధి కర్మాగారాలను కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి మూసేయడంతో గల్ఫ్ ప్రాంతాల నుంచి వచ్చే చమురు, గ్యాస్ నిలిచిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. రష్యా వంటి దేశాల నుంచి చమురు దిగుమతుల్ని పెంచాలని భావిస్తోంది.

‘‘ మేము(భారత్) 2022 నుంచి రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నాము’’అని కేంద్ర వర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు, 2026లో US గల్ఫ్ తీరం నుండి సంవత్సరానికి సుమారు 2.2 మెట్రిక్ టన్నుల LPGని దిగుమతి చేసుకోవడానికి నవంబర్ 2025లో ఒక సంవత్సరం ఒప్పందంపై సంతకం చేశాయని వారు తెలిపారు. దిగుమతులు జనవరిలో ప్రారంభమయ్యాయని చెప్పారు.