July 8, 2026

Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!
Reading Time: < 1 minute
Kitchen Hacks Remove Burnt Smell From Curry Easy Tips

Kitchen Hacks in Telugu:ప్రతి ఇల్లాలు వంటగదిలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య ‘కూర అడుగంటడం’. ఒక్క నిమిషం అజాగ్రత్తగా ఉన్నా లేదా మంట ఎక్కువగా ఉన్నా కూర మాడిపోతుంది. దీనివల్ల కూర అంతటా ఒక రకమైన చేదు వాసన, రుచి వచ్చేస్తాయి. అయితే, ఇలాంటప్పుడు కూరను పారేయకుండా మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు కొన్ని చిట్కాలు పాటించవచ్చు.

Water Supply: హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్.. ఈ ఏరియాల్లోనే..

ఐస్ క్యూబ్స్ చిట్కా.. తక్షణ పరిష్కారం
కూర అడుగంటినట్లు మీకు అనిపించిన వెంటనే, మంట ఆర్పేసి అందులో 2 నుండి 3 ఐస్ క్యూబ్స్ వేయాలి. అవి కరిగే వరకు అలాగే ఉంచడం వల్ల కూరలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి, మాడిన వాసన కూరలోని పై భాగాలకు వ్యాపించకుండా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియని ఒక ప్రభావవంతమైన మార్గం.

Tragedy : మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన స్కూల్ టీచర్.. ఆపై..!

పాత్రను మార్చడం మర్చిపోకండి
కూర మాడిందని తెలిసిన వెంటనే చేయాల్సిన మొదటి పని.. ఆ పాత్రలోని పైన ఉన్న మాడని భాగాన్ని జాగ్రత్తగా వేరే శుభ్రమైన గిన్నెలోకి మార్చడం. అడుగున అంటుకున్న మాడిన భాగాన్ని అస్సలు గీకకూడదు. అలా గీకడం వల్ల మాడిన నలుపు , వాసన మొత్తం కూరలోకి కలిసిపోయి రుచి పాడవుతుంది.

Social Media Ban : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సోషల్ మీడియా బ్యాన్

మరికొన్ని వంటింటి చిట్కాలు:

  • బంగాళదుంప ముక్క: కూరలో మాడిన వాసన ఎక్కువగా వస్తుంటే, ఒక పచ్చి బంగాళదుంపను ముక్కలుగా కోసి కూరలో వేసి పది నిమిషాలు ఉంచండి. బంగాళదుంపకు మాడిన వాసనను పీల్చుకునే శక్తి ఉంటుంది.
  • పాలు లేదా పెరుగు: గ్రేవీ కూరలు లేదా పప్పు వంటివి అడుగంటినప్పుడు, కొంచెం పాలు లేదా పెరుగు కలిపి కాసేపు ఉడికిస్తే మాడిన రుచి పోయి కొత్త రుచి వస్తుంది.
  • నిమ్మరసం: వేపుడు కూరలు (Fry) మాడిపోతే, చివరలో కొంచెం నిమ్మరసం చల్లడం వల్ల ఆ చేదు వాసన తగ్గుతుంది.