Reading Time: < 1 minute

హైదరాబాద్ లో హిట్ అండ్ రన్… స్కూటీని ఢీ కొట్టి పరారైన మహిళా డాక్టర్

Caption of Image.

హైదరాబాద్ గాంధీ నగర్ లో హిట్ అండ్ రన్ ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా డాక్టర్ తన కారుతో బైక్ ను ఢీ కొట్టి పరారైంది. ఫిబ్రవరి 2న ఈ ఘటన జరిగింది. 

అసలేం జరిగిందంటే..  ఫిబ్రవరి  2న కవ్వాడి గూడ నుంచి రాణిగంజి వైపు వెళ్తుండగా గాంధీ నగర్ లో   భరత్ పెట్రోల్ పంపు  దగ్గర  నిలోఫర్ డాక్టర్ ముందు వెళ్తున్న  స్కూటీనీ తన కారుతో  ఢీకొట్టి  ఆపకుండా వెళ్లింది.  సీసీటీవీ లో ఈ ఘటన రికార్డ్ అయ్యింది.  ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న బీరం కృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  బాధితుడి ఫిర్యాదు మేరకు  CCTV ఫుటేజ్  ఆధారంగా కారు నెంబర్ ను  ట్రేస్ చేశారు గాంధీ నగర్ పోలీసులు. ఆ కారు నిలోఫర్ డాక్టర్ బెక్కం విజయ నిర్మల పేరుతో రిజిస్ట్రేషన్ ఉంది.   

►ALSO READ | హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రానికి బాంబ్ బెదిరింపు….బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు

డాక్టర్ పై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయకుండా 125(a) నిర్లక్ష డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే  హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి మహిళా డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.