July 8, 2026

Karmeni Selvam: తెలుగు–తమిళ భాషల్లో సముద్రఖని మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

Karmeni Selvam: తెలుగు–తమిళ భాషల్లో సముద్రఖని మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
Reading Time: < 1 minute

Karmeni Selvam: తెలుగు–తమిళ భాషల్లో సముద్రఖని మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

Caption of Image.

సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న  తెలుగు, తమిళ బైలింగ్విల్ మూవీ ‘కార్మేని సెల్వం’.  రామ్ చక్రి దర్శకత్వంలో  పాత్‌‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై  అరుణ్ రంగరాజులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌ను ప్రకటించారు.

ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌‌నర్‌‌గా వ్యవహరిస్తూ భారీ రిలీజ్‌‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నిజాయితీగా జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ (సముద్రఖని) సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది.

ప్రస్తుత సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే అంశాన్ని ఎమోషనల్‌‌గా చూపించబోతున్నామని మేకర్స్ చెప్పారు.  లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, హరిత పరాకోడ్  ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

►ALSO READ | Janhvi Kapoor: జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్…‘పెద్ది’ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్

©️ VIL Media Pvt Ltd.