Reading Time: < 1 minute
Ustaad Bhagat Singh Story Line Controversy Bookmyshow Synopsis Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల సందడి మొదలైంది. అయితే, సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటున్న తరుణంలో ‘బుక్ మై షో’ (BookMyShow) లో కనిపిస్తున్న సినిమా సినాప్సిస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read : Avika Gor : తల్లి కాబోతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’? వైరల్ అవుతున్న అవికా గోర్ లేటెస్ట్ వీడియో!

ఎంటంటే.. మొదటి నుంచి ఈ సినిమా విజయ్ నటించిన ‘థెరి’కి రీమేక్ అని వార్తలు వచ్చినా, దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఇది రీమేక్ కాదని, కేవలం స్ఫూర్తి మాత్రమేనని చెబుతూ వచ్చారు. కానీ, తాజాగా బుక్ మై షోలో కనిపిస్తున్న స్టోరీ లైన్ దాదాపు ‘థెరి’ తరహాలోనే ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ఒక పక్కా ఒరిజినల్ మాస్ సినిమా ఆశిస్తున్న ఫ్యాన్స్‌కు, మళ్ళీ రీమేక్ ఛాయలు కనిపిస్తుండటం మింగుడుపడటం లేదు. సాధారణంగా బుక్ మై షో వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో సినిమాల రిలీజ్‌కు ముందు కొన్ని తాత్కాలిక లైన్స్ (Placeholders) యాడ్ చేయడం జరుగుతుంటుంది. సాదారనంగా సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదలయ్యాక వాటిని మారుస్తుంటారు. ఉస్తాద్ విషయంలో కూడా అదే జరుగుతుందని, హరీష్ శంకర్ తన మార్క్ మార్పులతో ఒక కొత్త కథనే చూపిస్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ లైన్ నిజమైతే మాత్రం అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో అని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.