Reading Time: 2 minutes

ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్: శంషాబాద్ నుంచి రద్దయిన పది విమానాల వివరాలు.. ఫ్లైట్ నంబర్లతో సహా..

Caption of Image.

హైదరాబాద్: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న పరిస్థితుల వల్ల శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. ఇప్పటికే 10 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు నిరాశగా వెనుదిరిగారు. దేశంలో ఉన్న పలు ఎయిర్ పోర్ట్ల నుంచి ఇరాన్ ఇజ్రాయిల్ వెళ్ళే విమానాలు రద్దు కావడం గమనార్హం. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయిల్లో అన్ని ఎయిర్ పోర్ట్లు మూసివేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది.

ఇరాన్పై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేస్తుండగా.. ఖతార్, బెహ్రయిన్, కువైట్, యూఏఈలో ఉన్న అమెరికా ఫోర్సెస్పై ఇరాన్ మిస్సైల్స్తో విరుచుకుపడుతున్న పరిస్థితులున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖతార్, కువైట్, యూఏఈ దేశాలు ఎయిర్ స్పేస్ ను క్లోజ్ చేశాయి. ఖతార్ రాజధాని నగరం దోహాలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఖతార్ డిఫెన్స్ మినిస్ట్రీ ఈ మిస్సైల్ అటాక్ను ధృవీకరించింది. దోహా నగరాన్ని ఇరాన్ మిస్సైల్స్ టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ కూడాఎయిర్ స్పేస్ను క్లోజ్ చేసింది. టెల్ అవీవ్ ఎయిర్ పోర్ట్కు రాకపోకలు నిలిచిపోయాయి.

మార్చి 7 వరకు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, లెబనాన్‌లోని బీరుట్, ఒమన్‌లకు విమానాలను నిలిపివేస్తున్నట్లు జర్మనీకి చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా తెలిపింది. శనివారం, ఆదివారం దుబాయ్‌కు బయలుదేరే విమానాలను కూడా ఈ ఎయిర్‌ లైన్ కంపెనీ నిలిపివేసింది. హంగేరీకి చెందిన తక్కువ ధర క్యారియర్ విజ్ ఎయిర్ సంస్థ.. మార్చి 7 వరకు ఇజ్రాయెల్, దుబాయ్, అబుదాబి, ఒమన్లకు బయలుదేరే అన్ని విమానాలను తక్షణమే నిలిపివేసింది. 

ఇరాన్‌లో దాడుల తర్వాత డచ్ క్యారియర్ KLM ఆమ్స్టర్డామ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాన్ని రద్దు చేసింది. ఢిల్లీ నుంచి -టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని ఎయిర్ ఇండియా దారి మళ్లించింది. ఇజ్రాయెల్ గగనతలం మూసివేయడంతో ఎయిర్ ఇండియా ఢిల్లీ-టెల్ అవీవ్ విమానాన్ని (AI139) ముంబైకి మళ్లించడం గమనార్హం.

రద్దయిన ఫ్లైట్ వివరాలు ఇవే:

Flt no.       Std.       Sector.       Load

1.6E-1315.  16:00hrs  DOH.      217

2.6E-57.       16:45hrs MED.     153

3.6E-1421.   19:25hrs SHJ.     181

4.6E-1407.    19:50hrs  AUH.    221

5.6E-67.        20:25hrs.  JED.     179

6.6E-93.        20:40hrs  RUH.    185 

7.6E-1233.    21:20hrs   KWI.    210

8.6E-85.       22:10hrs   DMM.  228

9.6E-1495.   23:00hrs   RKT.   16

10.6E-1273.  23:40hrs. MCT   178

©️ VIL Media Pvt Ltd.