Reading Time: < 1 minute
Tirumala: అయ్యో దేవుడా.. దైవ దర్శనం కోసమని వచ్చి..

శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా మొదటి ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలలో వెలుగు చూసింది. స్థానిక వాహనదారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ భద్రతా సిబ్బంది గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు ఇద్దరు తమిళనాడు రాష్ట్రం అరక్కోణం తాలుకా మిట్టపిట్టై గ్రామానికి చెందిన నటరాజన్, మునిరత్నంగా పోలీసులు గుర్తించారు. వీరు ఇటీవలే బైక్‌పై శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. దర్శనం ముగించుకొని ఇంటికి బయల్దేరారు. బైక్ మొదటి ఘాట్‌లో రోడ్డులోని 30వ మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గోడను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నటరాజన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మనిరత్నం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది గాయపడిన మనిరత్నంను హాస్పిటల్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.