
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్నకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం వరుస పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆమె, ఒక డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ వార్త ఇండస్ట్రీలోనూ, ఆమె అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రశ్మిక ‘రణబాలి’, ‘మైసా’ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాల కోసం వరుసగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, కఠినమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు చేయాల్సి రావడంతో ఆమె శరీరానికి తీవ్ర ఒత్తిడి గురైంది. ఈ క్రమంలోనే ఆమెకు హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్‌మెంట్ (Tendon Detachment) అయినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ రకమైన గాయం వైద్యులను సైతం విస్మయానికి గురిచేసింది. సాధారణంగా ఇలాంటి తీవ్రమైన గాయాలు కఠినమైన సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే వస్తుంటాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రశ్మిక రాబోయే 6 వారాల పాటు ఎలాంటి కదలికలు లేకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేశారు. అంతేకాకుండా, టెండన్ తిరిగి పూర్వ స్థితికి వచ్చి బలపడేందుకు ప్రత్యేకంగా రీహాబిలిటేషన్ కూడా అవసరమని తెలిపారు. ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో మోస్ట్ బిజీయెస్ట హీరోయిన్‌గా కొనసాగుతున్న రశ్మిక చేతిలో ఏకంగా నాలుగు భారీ చిత్రాల షూటింగ్స్ ఉన్నాయి. వీటితో పాటు దాదాపు 30 ప్రముఖ బ్రాండ్లకు ఆమె అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ అనూహ్య ప్రమాదం కారణంగా ఆమె నటిస్తున్న సినిమాలతో పాటు పలు యాడ్ షూటింగ్స్ కూడా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. త్వరలోనే ఆమె కోలుకుని తిరిగి షూటింగ్స్‌లోకి రావాలని ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.