
పనామా తీరంలో భారీ భూకంపం సంభవించింది. మొదట భూకంప తీవ్రత 8.0గా అంచనా వేయగా… ఆ తర్వాత 7.6గా సవరించారు అధికారులు. పనామాలోని అరిబ్రా ప్రాంతానికి నైరుతి దిశలో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఈ ప్రకంపనల ప్రభావంతో పనామా సహా పలు ప్రాంతాలు కంపించినట్లు తెలుస్తోంది.
భూకంపం ప్రభావంతో పనామా రాజధానితో పాటు పొరుగు దేశం కోస్టారికాలో కూడా భవనాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనం భయంతో ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీసినట్లు తెలుస్తోంది. ప్రాణనష్టం, ఆస్థి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భూకంప తీవ్రత కారణంగా తీరా ప్రాంతాలకు సునామీ ముప్పు ఉండచ్చని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. పనామా, కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్ తదితర దేశాల తీర ప్రాంతాలపై కూడా అలల ప్రభావం ఉండే అవకాశం ఉందని… దీంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అధికారులు..
సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు స్థానిక అధికారుల సూచనలు పాటించాలని.. అధికారిక హెచ్చరికలు వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.