
ఈ వారం ప్రారంభం నుంచి బులియన్ మార్కెట్లలో ట్రెండ్ మారుతోంది. మెుదట్లో రేట్లు తగ్గుతూపోగా వారాంతం నాటికి భారీగా పుంజుకున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న కీలక మార్పులకు తోడు ద్రవ్యోల్బణం పెరగటం కూడా రేట్ల పెంపుకూ కీలకంగా మారింది. ఈ క్రమంలో వీకెండ్ షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నవారు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ రేట్లలో వచ్చిన మార్పులను పరిశీలించటం బెటర్.
అక్టోబర్ 10న బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.71 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 142గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 880గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 10, 2026న దేశవ్యాప్తంగా రూ.5వేలు పెరిగింది కేజీకి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.