Reading Time: < 1 minute

ఢిల్లీలో సీజేపీ ధర్నా.. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ హౌస్ అరెస్ట్..!

Caption of Image.

ఢిల్లీలో సీజేపీ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ దగ్గర భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది సీజేపీ. ఢిల్లీ పోలీసులు సీజేపీ నిరసనలకు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు నగరంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కాక్రోచ్ పార్టీకి మద్దతుపలికిన వారిని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలో యూట్యూబర్ ధృవ్ రాఠీని గురుగ్రామ్ లో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు 

సీజేపీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యూట్యూబర్ ధృవ్ రాఠీని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. గురుగ్రామ్‌లో  పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనలకు మద్దతు పలికిన నటుడు ప్రకాష్ రాజ్ ను కూడా పోలీసులు అడ్డుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీజేపీ చీఫ్ దీప్కేను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో సీజేపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి.

ఢిల్లీ సరిహద్దుల్లో సుమారు 35వేల మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. జంతర్ మంతర్ తో పాటు ఎన్నికల సంఘం కార్యాలయం పరిసరాలు, బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇప్పటికే ఇంటర్నెట్ సేవలు నిలిపేసి.. ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని ప్రయవేక్షిస్తున్నారు పోలీసులు. దీంతో పాటు పలు మెట్రో స్టేషన్లలో రాకపోకలు ఆంక్షలు విధించి రైళ్లను కూడా రద్దు చేశారు.

©️ VIL Media Pvt Ltd.