Reading Time: 2 minutes

రోడ్లపై సిమెంట్ దిమ్మెలు.. ముళ్ల కంచెలు : ఢిల్లీ చుట్టూ పోలీసుల వలయం

Caption of Image.

ఢిల్లీలో క్షణక్షణం  టెన్షన్ టెన్షన్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. జంతర్ మంతర్  లో నిరసనకు వస్తున్న ఆందోళన కారులను, కాక్రోచ్ పార్టీ మద్ధతు దారులను ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు పోలీసులు. ముళ్ల కంచెలు, సిమెంట్ దిమ్మెలతో కాక్రోచ్ లను అడ్డుకుంటున్నారు. అడుగడుగునా పోలీసులతో ఢిల్లీ పోలీసుల వయంగా మారిపోయింది. 

కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ.. 2026 అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సీజేపీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ 2.O లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి కాక్రోచ్ లు, జెన్ జీలతో పాటు సీజేపీ మద్ధతు దారులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో అడుగడుగునా పోలీసు  బలగాలతో యుద్ధవాతావరణం తలపిస్తోంది. 

కేరళ హౌస్ దగ్గర భారీగా పోలీసులు:

జంతర్ మంతర్ కు దగ్గర్లో ఉన్న కేరళ హౌస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నిరసన కారులను అడ్డుకునేందుకు కాస్త గ్యాప్ లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం మీడియాకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. కేరళ హౌస్ మీదుగా నిరసన కారులు జంతర్ మంతర్ చేరుకోకుండా అడ్డుకుంటున్నారు. 

ఘజియాబాద్ బార్డర్ లో సిమెంటు దిమ్మెలతో రోడ్లు బ్లాక్:

ఉత్తరప్రదేవ్ నుంచి డిల్లీ వచ్చే ఘజియాబాద్ బార్డర్ దగ్గర పోలీసు బలగాలు భారీ ఎత్తున మోహరించారు. సిమెంటు  దిమ్మెలతో వాహనాలు వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా  బారికేడ్లతో, ఇనుప కంచెలతో రోడ్లు బ్లాక్ చేశారు. 

అప్సరా బార్డర్  లో సెక్యూరిటీ టైట్:

అటు అప్సరా బార్డర్ లోనూ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు చేస్తున్నారు. డ్రోన్స్ తో నిఘా పెంచారు. సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. డీసీపీ షహదరా రాజేంద్ర ప్రసాద్ మీన ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అప్సరా బార్డర్ నుంచి ఢిల్లీలోకి ఎంటరయ్యే మార్గం  మొత్తం బారికేడ్లతో నిండిపోయింది. ఎటు చూసినా ముళ్ల కంచెలు దర్శనమిస్తున్నాయి. నిరసనకు వెళ్తున్నట్లు చిన్న అనుమానం వచ్చినా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువతను ఎక్కడికక్కడ డిటైన్ చేస్తున్నారు పోలీసులు. 

©️ VIL Media Pvt Ltd.