
Jantar Mantar Protest: భారతదేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శన, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా (Danish Kaneria) చేసిన సెటైరికల్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భారత రాజకీయ పరిణామాలను క్రికెట్ భాషతో ముడిపెడుతూ ఆయన చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్: కనేరియా
ఈరోజు (శనివారం, అక్టోబర్ 10న) రాజధాని ఢిల్లీలో జరగనున్న ఈ నిరసన కార్యక్రమం దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంటారని ఆశిస్తున్నాను! (I hope Delhi Police win the toss and decide to bat first!) అంటూ చమత్కరించారు. క్రికెట్‌లో టాస్ ప్రక్రియ, బ్యాటింగ్ పదాలను ఉపయోగిస్తూ.. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసు వర్గాలు సిద్ధమైన తీరుపై ఆయన ఈ రకమైన వ్యంగ్యాస్త్రంతో సంధించారు. కనేరియా చేసిన ఈ ట్వీట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
I hope Delhi Police win the toss and decide to bat first! 🏏
— Danish Kaneria (@DanishKaneria61) October 10, 2026
ఢిల్లీ నిరసనలు ఎందుకు చేస్తున్నట్లు?:
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో జరిగిన అక్రమాలపై చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్‌ను బాధ్యులను చేస్తూ, జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నిరసన దృష్ట్యా ఢిల్లీ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గతంలోనూ అంతర్జాతీయ, సామాజిక పరిణామాలపై నిష్పాక్షికంగా మాట్లాడే డానిష్ కనేరియా, ఈ పొలిటికల్ పరిణామానికి క్రికెట్ రంగు పులమడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లతో రీ-ట్వీట్లు చేస్తున్నారు.
Delhi police came up with a body cam today. Now, they will have all the recordings so nobody can alleged them for beating and harrasment. https://t.co/o4CSN3OUXy
— Arya (@Aryaxsays) October 10, 2026