
- నిరసనకారులపై మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అనుచరుల దాడి
కరీంనగర్ (పెద్దపల్లి), వెలుగు: పెద్దపల్లిలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి బీసీ సెల్ముఖ్య నాయకుల సమావేశం రసాభాసగా మారింది. ఈ మీటింగ్‌కు ఆ పార్టీ బీసీ నేతలు మాజీ జడ్పీటీసీ గంట రాములు, దాసరి ఉష, చిరుమల్ల రాకేశ్‌ను ఆహ్వానించలేదు. దీంతో వారి అనుచరులు గోపరపల్లి సర్పంచ్ రవి యాదవ్, హరిపురం మాజీ ఉపసర్పంచ్ నాగరాజు యాదవ్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని నిలదీయగా, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో మనోహర్‌రెడ్డి అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో హరిపురం సర్పంచ్ విజయ నాగరాజుతోపాటు పలువురికి గాయాలయ్యాయి. కారు, కుర్చీలు ధ్వంసం అయ్యాయి. సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, దాసోజు శ్రవణ్, పల్లె రవికుమార్ గౌడ్, బాలరాజ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.