
CJP: అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కోకన్వీనర్ అశుతోష్ రాంకా, ఆయన మద్దతుదారుల్ని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గౌహతిలో సీజేపీ వాలంటీర్ల సమావేశానికి ముందే రాంకాతో సహా పలువురు కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమావేశానికి వెళ్తున్న సమయంలో తమను అడ్డుకున్నారని సీజేపీ ఆరోపిస్తోంది. రాంకాతో పాటు నాగాలాండ్ నుంచి వచ్చిన ముగ్గురు కార్యకర్తలు మరికొందర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఘటనపై సీజేపీ కన్వీనర్, వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అశుతోష్ రాంకా, ఆయన టీం ఒక సమావేశానికి వెళ్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకుని గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని సోషల్ మీడియా పోస్టులో ఆరోపించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో సీజేపీ ప్లాన్ చేసింది. అశుతోష్ రాంకా గౌహతిలో సమావేశానికి పిలుపునిచ్చారు. తొలుత అథ్‌గావ్‌లోని అస్సామ్ శ్రీ పరుశురామ్ సేవా సదన్‌లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వేదిక మార్చి అస్సాం సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న చౌదరి తిలా వద్ద నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్భంధించిన కార్యకర్తల్ని కలిసేందుకు న్యాయవాదుల్ని అనుమతించడం లేదని సీజేపీ ఆరోపించింది. వెంటనే తమ వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
దీనికి ముందు అస్సాంలో పాఠశాలలు, భూమి, అడవులు, నీటి వనరులు, మౌలిక సదుపాయల వసతులపై అశుతోష్ రాంకా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఆరోపణలు చేశారు. ఎస్ఐఆర్ ద్వారా ప్రభావితమైన కుటుంబాలను కలవడానికి తాము అస్సాం వచ్చినట్లు రాంకా చెప్పారు.
Ashu was picked up by Assam Police from a private residence. They have still not been told under what charges or on what grounds he has been detained.
If Ashu is not released, I will go to Assam along with other CJP members. Himanta can arrest us all.
— Abhijeet Dipke (@abhijeet_dipke) September 27, 2026