Reading Time: < 1 minute

హైదరాబాద్ లో ఇంకా నిమజ్జనాలు… క్యూలో 200 విగ్రహాలు..

Caption of Image.

హైదరాబాద్ లో ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ముగిసి రెండు రోజులు అవుతున్నా.. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా దగ్గర ఇంకా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ( సెప్టెంబర్ 27 ) ఉదయానికి కూడా 150 నుంచి 200 వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలో ఉన్నాయి. శనివారం రాత్రి తీసిన విగ్రహాలను ఇవాళ ఉదయం నుంచి నిమజ్జనం చేస్తున్నారు.

పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ లో 10 క్రేన్లతో నిమజ్జనం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నిమజ్జనం పూర్తవుతుందని అంటున్నారు పోలీసులు. టస్కర్లు దొరకకపోవడంతో విగ్రహాలు నిన్న నైట్ తీసి ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు మండపాల నిర్వాహకులు.  ఈ క్రమంలో ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ వైపు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

ఇదిలా ఉండగా… హైదరాబాద్ లో నిమజ్జన వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి  హుస్సేన్​సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం 66 వేల వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లోనే సుమారు 26 వేల ప్రతిమలు సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలివచ్చాయన్నారు. ఇక, మూడు కార్పొరేషన్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో 1,20,000, సీఎంసీ పరిధిలో 1,19,667, ఎంఎంసీ పరిధిలో 70,710 విగ్రహాలు.. మొత్తం 3 లక్షలకు పైగా విగ్రహాల ఇమ్మర్షన్​పూర్తయిందని పేర్కొన్నారు. 

భారీ సంఖ్యలో విగ్రహాలు వచ్చినప్పటికీ ముందస్తు ఏర్పాట్లతో కార్యక్రమం ప్రశాంతంగా సాగిందని చెప్పారు. హుస్సేన్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు నగరంలోని ఇతర నిమజ్జన కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు పారిశుధ్య సిబ్బంది నిమజ్జన కేంద్రాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టారు. 
 

©️ VIL Media Pvt Ltd.