Reading Time: < 1 minute
Will The First Single Narayanamma From Adarsha Kutumbam Be Released Today

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో, మూవీ లవర్స్‌లో భారీ అంచనాలు నెలకొంటాయి. వీరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47′. అయితే మొదట ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినప్పటికీ, కొన్ని సాంకేతిక, ఇతర కారణాల వల్ల వారం రోజులు వాయిదా వేసి చివరకు అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు .

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సెప్టెంబర్ 22న మొదటి పాట ‘నారాయణమ్మ‘ విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే సినిమా విడుదల తేదీ మారడంతో ఈ ఫస్ట్ సింగిల్ విడుదల కూడా వాయిదా పడింది. పాటపై ఇప్పటివరకు అధికారిక అప్‌డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాటను సెప్టెంబర్ 27న అనగా ఈరోజు గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరి కనీసం ఏరోజైనా సాంగ్ రిలీజ్ చేస్తారో లేక మరోసారి వాయిదా వేస్తారో చూడాలి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా నారా రోహిత్, నివేథా పెతురాజ్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఈ కుటుంబ కథా చిత్రానికి సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్-వెంకటేష్ మేజిక్ తో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.