Reading Time: < 1 minute

డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ పోస్టులు.. ఇంజినీరింగ్ చేసినోళ్లకు సూపర్ ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవే!

Caption of Image.

రక్షణ పరిశోధన సంస్థ అయిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ (డీఐహెచ్ఏఆర్)లో జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 17.

విభాగాల వారీగా ఖాళీలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)15, రీసెర్చ్ అసోసియేట్ (ఆర్ఏ) 2.

ఎలిజిబిలిటీ
జూనియర్ రీసెర్చ్ ఫెలో: కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెకానికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇనుస్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ తదితర ఇంజినీరింగ్ విభాగాల్లో మొదటి తరగతిలో బీఈ/ బి.టెక్ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మొదటి తరగతిలో ఎంటెక్ పూర్తిచేసి ఉండాలి.

రీసెర్చ్ అసోసియేట్: కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఎంటెక్ పూర్తిచేసి ఉండాలి. కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. 

వయసు: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 28 ఏళ్లు, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: అక్టోబర్ 14. 

సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాలు, వివరాల ప్రాథమిక పరిశీలన ఆధారంగా షార్ట్​లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత షార్ట్​లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.indiascienceandtechnology.gov.inను సందర్శించండి. 
 

©️ VIL Media Pvt Ltd.