
శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటించిన చిత్రం ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’. పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డా. చింతాడ హేమారావు నిర్మించారు. శ్రీలక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు అక్టోబర్ 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నారు. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూశాను.
ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. హీరో శ్రవణ్, హీరోయిన్ మలైకాను చూస్తే ఈ కథకు వీళ్లు తప్ప మరెవరూ యాప్ట్ కాదు అనిపించింది. అంత బాగా నటించారు. ఒక కొత్త తరహా ప్రేమ కథతో వస్తున్న ఈ సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. ఈ చిత్రంలో తండ్రీ కొడుకు మధ్య బాండింగ్, తల్లీ కొడుకు మధ్య అనుబంధం, స్నేహితుల మధ్య బాండింగ్, ప్రేమ జంట మధ్య ఉండే లవ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని హీరో శ్రవణ్ అన్నాడు.
యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా ఉంటుందని హీరోయిన్ మలైకా టి. వాసుపల్ చెప్పింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ దర్శకుడు మంగా శ్రీనివాస్ థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రేమకథను ఈ చిత్రంలో చూస్తారని నిర్మాత హేమారావు అన్నారు. ఈ సినిమాలోని ప్రతి సీన్ బ్యూటిఫుల్‌గా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు అన్నారు.