
సందీప్ రెడ్డి పుణ్యమా అని తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ యానిమల్ మూవీతో చూశాడు రణబీర్ కపూర్. 2023లో విడుదలైన ఈ చిత్రం 900 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. చాక్లెట్ అండ్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్.. ఫ్యామిలీ అండ్ యాక్షన్ హీరోగా మారిపోయాడు. రణబీర్ ఇక జెడ్ స్పీడుతో దూసుకెళతాడని ఊహించారు.. కానీ కట్ చేస్తే ఢిఫరెంట్ జోనర్ అండ్ భారీ సబ్జెక్ట్స్ కమిటై ఆడియన్స్‌తో గ్యాప్‌లో పడిపోయాడు. ఈ గ్యాప్ ఫిల్ చేసుకునేందుకు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
యానిమల్‌లో వయలెంట్ రణబీర్‌ను చూసిన ఆడియన్స్.. నెక్ట్స్ రామునిగా కూల్ క్యారెక్టర్‌లో చూడబోతున్నారు. దీపావళికి రిలీజౌతోంది రామయణ పార్ట్ వన్1. ఇండియా సినీ చరిత్రలోనే కనివిని ఎరుగని బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు నితీష్ తివారీ, నమిత్ మల్హోత్రా. సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా కనిపించబోతున్న రామాయణ విజువల్ వండర్‌గా రాబోతోంది. : రామాయణతో పాటు సంజయ్ లీలా భన్సాలీకి కమిట్ అయ్యాడు రణబీర్. లవ్ అండ్ వార్ రెండేళ్ల నుండి తెరకెక్కిస్తూనే ఉన్నాడు భన్సాలీ. రణబీర్ అండ్ విక్కీ కౌశల్, ఆలియా భట్ నటిస్తోన్న ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాకయ్యింది. నెక్ట్స్ ఇయర్ జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీకెండ్, రిపబ్లిక్ హాలీడేస్‌ని టార్గెట్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గా రిలీజ్ చేసిన బ్లడీ రణబీర్ లుక్స్ ఇంటెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. జనవరిలో లవ్ అండ్ వార్‌తో వస్తున్న రణబీర్.. 2027 దీపావళికి రామాయణ2తో పలకరించబోతున్నాడు. ఇవే కాదు చేతిలో బ్రహ్మస్త్ర2, యానిమల్ పార్క్ ఉండనే ఉన్నాయి. ఈ లైనప్ చూస్తే రణబీర్ ఇక గ్యాప్ తీసుకోనట్లే ఉన్నాడు.