
ఎస్‌ఎస్ రాజమౌళి గ్లోబల్ ట్రాటర్ ప్రాజెక్ట్‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమా కోసం ఇప్పటికే విపరీతంగా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా తన షూటింగ్‌ను కూడా ఫినిష్ చేసేసి.. తన గడ్డంను తీసేసిన లుక్‌తో మహేష్ వైరల్ అవుతున్నాడు. మరో పక్క ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చి ఇప్పుడు అక్రాస్ సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతోంది. వారణాసిలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్నాడు. రాజమౌళి మార్క్ యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్. ముఖ్యంగా సినిమాలో సుమారు 30 నిమిషాల పాటు సాగే భారీ యుద్ధ సన్నివేశం ఉందని సమాచారం. ఈ వార్ సీక్వెన్స్ సినిమాలో కీలక ఘట్టంగా నిలుస్తుందని, ఇందులో శ్రీరాముడి ప్రస్తావన కూడా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారణాసి కథ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని మరో ప్రచారం సాగుతోంది. కథలో భాగంగా భారత్‌లోని వారణాసితో పాటు అంటార్కిటికా, ఆఫ్రికా, ప్రాచీన రోమ్ వంటి విభిన్న ప్రాంతాలు కనిపించనున్నట్లు సమాచారం. విభిన్న భౌగోళిక నేపథ్యాల్లో కథను నడిపించడంతో పాటు భారీ స్థాయిలో యాక్షన్, అడ్వెంచర్ అంశాలను వారణాసిలో జోడిస్తున్నారని టాక్. భారీ కథ, విస్తృతమైన కథా ప్రపంచం ఉన్న సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కించడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారింది. అయితే వారణాసి విషయంలో మాత్రం మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ కథను రెండు భాగాలుగా కాకుండా ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఇంత భారీ కథను ఒకే సినిమాలో ఎలా చెప్పబోతున్నారు?.. కథనం ఏ స్థాయిలో ఉండబోతోంది?.. యాక్షన్, అడ్వెంచర్‌తో పాటు పౌరాణిక అంశాలను రాజమౌళి ఎలా మేళవించబోతున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మహేశ్ బాబు–రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ 2027 ఏప్రిల్ 7 వైపు అందరి చూపులు కూడా ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సాలిడ్ టీజర్ వస్తోంది!
The Paradise Collection: దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాని కెరీర్‌లో ఫాస్టెస్ట్ రూ.100CR!
Avengers Endgame Encore: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ దెబ్బకు.. మన బాహుబలి రికార్డ్ గల్లంతు!
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్ కోసం ఆగాల్సిన పనే లేదు!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. తగ్గనున్న కరెంట్ బిల్లు ఛార్జీలు