
చాలామంది మాంసాహార ప్రియులు చికెన్, మటన్‌తో పాటు వాటి లివర్లను కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా మటన్ లివర్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే, చికెన్ లివర్ కూడా ఆరోగ్యానికి అంతే మేలు చేస్తుందని చాలామందికి తెలియదు. ఏవేవో అపోహలు ప్రచారంలో ఉన్నప్పటికీ, వాస్తవానికి చికెన్ లివర్ అనేక పోషక విలువలను కలిగి ఉండి.. శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మన దేశంలోనే కాకుండా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి ఇతర ఆసియా దేశాలలో కూడా చికెన్ లివర్‌ను ప్రజలు తరచుగా ఆహారంలో భాగంగా తీసుకుంటారు.
చికెన్ లివర్ మన శరీరానికి అవసరమయ్యే అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది.
ఐరన్ సమృద్ధి: చికెన్ లివర్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కేవలం 100 గ్రాముల చికెన్ లివర్ తీసుకున్నప్పుడు, అది సుమారు 12 మిల్లీగ్రాముల ఐరన్‌ను అందిస్తుంది. ఐరన్ శరీరంలో రక్తం ఉత్పత్తికి అత్యంత అవసరం. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది, దీనివల్ల అలసట, బలహీనత, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చికెన్ లివర్ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరంలో ఐరన్ స్థాయిలు మెరుగుపడి, రక్తహీనత నుంచి బయటపడవచ్చు.
విటమిన్ ఏ: విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి అత్యంత కీలకం. పాలు, కోడిగుడ్లు, మటన్ వంటి ఇతర మాంసాహారాల కంటే చికెన్ లివర్‌లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల చికెన్ లివర్‌లో దాదాపు 10.5 మిల్లీగ్రాముల విటమిన్ ఏ లభిస్తుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది, కంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే, శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అందుకే చికెన్ లివర్‌ను తరచుగా తినడం వల్ల ఎలాంటి అనారోగ్య ఫలితాలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్ బి2 (రైబోఫ్లేవిన్) ప్రయోజనాలు: చికెన్ లివర్‌లో విటమిన్ బి2 లేదా రైబోఫ్లేవిన్ కూడా అధికంగా ఉంటుంది. 100 గ్రాముల చికెన్ లివర్‌లో 1.2 మిల్లీగ్రాముల విటమిన్ బి2 లభిస్తుంది. ఇది శరీర మెటబాలిజం (జీవక్రియ)ను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా, మనం తినే పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్‌లను శక్తిగా మార్చడంలో విటమిన్ బి2 సహాయపడుతుంది. ఇది షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, రక్తనాళాలు గట్టిపడకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది. ఫలితంగా, గుండె జబ్బుల ప్రమాదం తగ్గి, గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది.
ఇతర ముఖ్యమైన పోషకాలు: ఐరన్, విటమిన్ ఏ, బి2తో పాటు, చికెన్ లివర్‌లో క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, సెలీనియం వంటి అనేక ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
- క్యాల్షియం – ఫాస్ఫరస్: ఇవి ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి అత్యంత అవసరం, వాటిని దృఢంగా ఉంచుతాయి.
- పొటాషియం: ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుతుంది.
- జింక్: రోగనిరోధక శక్తిని పెంచడంలో, గాయాలు మానడంలో సహాయపడుతుంది.
- సెలీనియం: ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, కణాలను దెబ్బతినకుండా రక్షిస్తుంది.
ఈ అన్ని పోషకాల సమతుల్యత వల్ల చికెన్ లివర్, మటన్ హానికరం కాదని, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనదని స్పష్టమవుతుంది. దీన్ని తరచుగా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని డైటీషియన్లు పేర్కొంటున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..