జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ముఖ్య గ్రహ మార్పులు జరగబోతున్నాయి. అక్టోబర్ నెలలో బతుకమ్మ, దసరా వంటి పండుగలు కూడా రాబోతున్నాయి. ఇక కొన్ని రాశుల వారికి ఈ నెలలో మంచి జరగనుంది. ఇంకా వీరి అడ్డంకులు కూడా తొలగిపోయి శుభాలు కలుగుతాయి.
ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
తులా రాశి : తులా రాశి వారికీ రెండు రెట్లు మేలు జరగబోతుంది ఇంకా సూర్యుడు కూడా ఈ లగ్నంలోనే ఉంటాడు. పని ఒత్తిడి ఉన్నా అనుకున్న వాటిని పూర్తి చేస్తారు ఇంకా వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఇంకా వీరి ఆదాయం పెరిగి పొదుపు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఉహకందని మార్పులు జరగబోతున్నాయి. ఇక మీ ఇంట్లో కూడా అంతా మంచిగా ఉండబోతుంది. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో వాహనం, ఆస్తి కొనుగోలు చేస్తారు. ఇంకా అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలి. ప్రతి ఆదివారం గురువును పూజిస్తే మంచి జరుగుతుంది. ఆర్ధిక సమస్యల నుంచి బయటపడతారు.
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




