Reading Time: < 1 minute

అభిశంసనకు ఆధారాల్లేవు.. సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌పై ఆరోపణల్లో బలం లేదు: ముకుల్ రోహత్గి

Caption of Image.

న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను తొలగించాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనకు రాజ్యాంగపరమైన ఆధారాలు లేవని మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని, బలమైన ఆధారాలు లేకుండా అభిశంసన చేపట్టలేమని స్పష్టం చేశారు. 

ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌‌‌‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. సీఈసీ నిర్ణయాలపై 14 అడ్మినిస్ట్రేటివ్ నోట్స్ ఇచ్చారని వచ్చిన వార్తలను రోహత్గి ప్రస్తావించారు. అవి అంతర్గత అభిప్రాయాలేనని, ఈసీ మెజారిటీతో నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. 

కేబినెట్ సెక్రటరీకి వారు లేఖ రాయడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ అని, కేబినెట్ సెక్రటరీకి దాని అంతర్గత వ్యవహారాల్లో పాత్ర లేదన్నారు. అయితే, సీఈసీకి ప్రత్యేక అధికారం లేదని, ముగ్గురు కమిషనర్ల ఓట్లకు సమాన విలువ ఉంటుందని చెప్పారు. ఇది చాలా చిన్న విషయమని.. పెద్దదిగా చేసి చూపుతున్నారని అన్నారు.

 

©️ VIL Media Pvt Ltd.