
సమాజంలోని యదార్థ సంఘటనల ఆధారంగా, వినోదం, బలమైన సామాజిక సందేశంతో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా ‘ధర్మస్థల నియోజకవర్గం’. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. లేటెస్ట్ గా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘ఆది’ సెంటిమెంట్.. మళ్లీ రిపీట్..
ఈ సందర్భంగా వి. వి. వినాయక్ మాట్లాడుతూ..నా మొదటి సినిమా ‘ఆది’కి చంద్రబోస్ గారే మొదటి పాట రాశారు. ఈ రోజు జ్ఞాన ప్రభ తొలి చిత్రానికి కూడా ఆయనే ఐదు పాటలు రాశారు. కథ నచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా పాటలందించారని చంద్రబోస్ నాతో చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా ‘ఆది’ అంత పెద్ద విజయం సాధిస్తుంది’ అని నమ్మకం వ్యక్తం చేశారు.
‘రంగస్థలం’రేంజ్ సాహిత్యం..
ఆస్కార్ విజేత చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘రంగస్థలం’ తర్వాత నాకు అంత సంతృప్తినిచ్చిన సినిమా ఇది. మానవుడిలోని మంచి-చెడుల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. మహవీర్ అందించిన స్వరాలకు తగ్గట్టుగా ‘న్యాయం చేయరా దేవుడా’, ‘ధర్మో రక్షతి రక్షిత:’ వంటి ఐదు అద్భుతమైన పాటలు రాశాను అని తెలిపారు.
ALSO READ : KGFకి ముందే నా కొడుకు సూపర్‌స్టార్…
ఈ చిత్రంలో సత్యప్రకాష్ తనయుడు నటరాజ్ హీరోగా పరిచయమవుతుండగా,.. వరుణ్ సందేశ్, వితికా షేరు, సాయికుమార్, సుమన్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. నటి కస్తూరి ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్‌లో కనిపించి సర్ ప్రైజ్ చేయనున్నారు. యదార్థ ఘటనల ఆధారంగా డ్రగ్స్ మాఫియా, రాజకీయ కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ ‘ధర్మస్థల నియోజకవర్గం’ సెప్టెంబర్ 4 నుండి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది..