
ఉప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నారపల్లి దాటి మేడిపల్లి సమీపంలో నుంచి బోడుప్పల్, ఉప్పల్ వరకు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే రూట్ లో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
2026 ఆగస్టు 30 ఆదివారం కావడం.. దీనికి తోడు మిలాదున్ నబీ, రాఖీ సెలవులతో పాటు వీకెండ్ పూర్తి చేసుకుని జనాలు హైదరాబాద్ బాట పట్టారు. దీంతో వరంగల్ -హైదరాబాద్ రూట్ లో వాహనాలు బారులు తీరాయి.
మరోవైపు ఆదివారం కావడంతో యాదగిరి గుట్ట, స్వర్ణగిరి, వరంగల్ వెళ్లే వాహనదారులతో హైదరాబాద్ – వరంగల్ రూట్ కూడా బిజీ అయిపోయింది. మెల్లగా కదులుతుండటంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ లో అంబులెన్స్ కు కూడా దారి దొరకని పరిస్థితి.