Reading Time: < 1 minute
Nepal Floods Why Rejected China Us Rescue Help India Assistance

Nepal Floods: నేపాల్‌లో వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. భోటెకోశి నది ఉప్పెనలా విరుచుకుపడటంతో చైనా సరిహద్దుల్లో ఉన్న నేపాల్ జిల్లాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 500 మందికి పైగా మరణించగా, 1000 మందికి పైగా గల్లంతయ్యారు. సాయం చేస్తామని ప్రపంచదేశాలు ముందుకొస్తున్నా నేపాల్ సాయాన్ని మాత్రం వద్దని చెబుతోంది. చైనా, అమెరికా సహా పలు దేశాల నుంచి నేపాల్ సాయాన్ని తిరస్కరించింది. సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించడానికి సొంత భద్రతా సంస్థలు పూర్తి సామర్థ్యం ఉందని నేపాల్ చెప్పింది.

చైనా, అమెరికా సహా పలు దేశాలు నేపాల్‌కు హెలికాప్టర్లు, సహాయక బృందాన్ని పంపుతామని కోరాయి. అయితే, 2015 భూకంపం తర్వాత తమకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నేపాల్ ఈ సాయాన్ని సున్నితంగా తోసిపుచ్చుతోంది. 2015 భూకంపం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ బృందాలు, సైనిక విమానాలు, విదేశీ సహాయ సంస్థల తాకిడితో కాఠ్మాండు విమానాశ్రయం, పరిపాలన వ్యవస్థ కుప్పకూలిపోయింది. విదేశీ బృందాల మధ్య సమన్వయ లోపం, పోటీ సంక్షోభాన్ని తగ్గించకపోగా, మరింత పెంచాయి. దీంతో నేపాల్ ఈ సారి విదేశీ సాయాన్ని తిరస్కరిస్తోంది.

భారత సాయాన్ని స్వీకరించిన నేపాల్..

అయితే, సహాయక సామాగ్రి, వైద్య సామాగ్రి, ఆర్థిక విరాళాలను తాము స్వీకరిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. భారత విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకారం.. సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ భారత్ సహాయాన్ని కోరినట్లు చెప్పింది. భారతదేశం ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని, ఆ తర్వాత భూగర్భ పరిస్థితులను, పరికరాల అవసరాలను అంచనా వేయడానికి ఒక పరిశీలనా బృందాన్ని పంపడానికి సిద్ధమవుతోంది. ఒక వైద్య బృందాన్ని కూడా పంపుతున్నారు.

భారత్ ప్రభుత్వం ఇప్పటికే వైమానిక దళానికి చెందిన సి-130జె మరియు సి-17 గ్లోబ్‌మాస్టర్ విమానాల ద్వారా 47.5 టన్నుల సహాయక సామగ్రిని పంపింది. ఇందులో తాత్కాలిక గుడారాలు, దుప్పట్లు, మందులు, సోలార్ దీపాలు , ఆహార ప్యాకెట్లు ఉన్నాయి. దెబ్బతిన్న వంతెనల స్థానంలో లోయ వంతెనలు,ప్రీఫ్యాబ్రికేటెడ్ వంతెనలను నిర్మిస్తామని కూడా భారతదేశం ముందుకొచ్చింది. నేపాల్ అభ్యర్థించిన సహాయం మేరకు చర్యలు తీసుకుంటుందని విదేశాంగ ప్రతినిధి రణధీన్ జైస్వాల్ చెప్పారు.