
భారతీయ సంగీత ప్రపంచంలో తన దివ్య గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల, భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. ఇప్పడు ఆమె జీవిత ఆధారంగా ఓ భారీ బయోపిక్ తెరకెక్కించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భారతీయ సంగీత సామ్రాజ్యపు మహారాణి జీవిత చరిత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించేందుకు సినీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.
ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి పాత్రలో ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న నటించబోతున్నట్లు తెలుస్తోంది. ‘జెర్సీ’ వంటి క్లాసిక్ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్ మరియు కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ల్యాండ్‌మార్క్ మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాత్ర కోసం రష్మికకు సీక్రెట్‌గా లుక్ టెస్ట్ కూడా నిర్వహించారని, సంప్రదాయబద్ధమైన ఆ గెటప్‌లో ఆమె లూక్స్ చూసి మేకర్స్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఒక క్లాసికల్ ఐకాన్ పాత్రలో రష్మిక నటించడం ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. అల్లు అరవింద్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు మరియు అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. వాస్తవానికి ఈ సినిమాలో మొదట సాయి పల్లవి పేరు వినిపించింది. కానీ అనుకోని కారణాల వలన సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆపాత్ర కోసం రష్మికను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.