Reading Time: < 1 minute

బీజేపీ ఒత్తిడి వల్లే సోనియా పుస్తకం ఆగింది.. ఈ బుక్‌‌‌‌‌‌‌‌ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నది: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 

Caption of Image.

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఒత్తిళ్ల వల్ల కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ ప్రింటింగ్‌‌‌‌‌‌‌‌ వ్యవహారంలో ‘పెంగ్విన్’ కంపెనీ వెనక్కి తగ్గిందని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్‌‌‌‌‌‌‌‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’తో పాటు ఆర్ఎస్ఎస్ సంబంధిత పుస్తకాలను ప్రచురించే సంస్థకు, సోనియా పుస్తకంపై భయం ఎందుకని ప్రశ్నించారు. ఈ పుస్తకం ప్రజల్లోకి వెళ్లకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. 

రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులు లేకుండా విడుదలవుతున్న పుస్తకంపై భారత్‌‌‌‌‌‌‌‌లో ఎవరి ఒత్తిడి ఉందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయడమేనని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేశవన్ స్పందిస్తూ.. సోనియా ఆత్మకథపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులు కల్పిత కథలు అల్లుతున్నారని మండిపడ్డారు. మరో నేత అజయ్ అలోక్ మాట్లాడుతూ, ఆధారాలు లేని అంశాలు పుస్తకంలో ఉండటం వల్లే ప్రచురణ సంస్థ వెనకడుగు వేసిందని, క్రెడిబిలిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రచురణకర్తలకు ఉంటుందని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.