Reading Time: 2 minutes

పెట్రోల్ బిల్లులో ఇథనాల్ శాతం చెప్పాలని పిటీషన్ : తిరస్కరించిన సుప్రీంకోర్టు

Caption of Image.

పెట్రోల్, డీజిల్ లో ఇథనాల్ పై దేశ వ్యాప్తంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇథనాల్ కలపడం వలన ఇంజిన్లు పాడవుతున్నాయని.. ఇథనాల్ బ్లెండింగ్ అంశంపై ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కలుపుతున్న ఇథనాల్ శాతం ఎంతో పెట్రోల్ బంకులు, బిల్లులపై వెల్లడించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ నమోదైంది. 2026 ఆగస్టు 31న సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరించింది. 

జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే లతో కూడిన ధర్మాసనం ఆర్టికల్ 32 కింద ఉన్న ఈ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ విషయంలో సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చునని పిటిషనర్ నరేంద్ర కుమార్ గోస్వామికి సూచించింది. 

పిటిషన్లో ఏముంది..?

దేశంలోని ప్రతి పెట్రలో బంక్ లో.. పెట్రోల్ ఫిల్ చేసే నాజల్ పై ఎంత ఇథనాల్ కలిపారో తెలిసేలా డిస్ప్లే చేసేలా అధికారులను ఆదేశాంచాలని పిటిషన్ లో పేర్కొన్నారు. 

దీనికి తోడు ప్రతి ఇన్ వాయిస్, బిల్ లేదా రిసిప్ట్ లో పెట్రోల్ శాతాన్ని క్లియర్ గా మెన్షన్ చేయాలని కోరారు. పెట్రోల్ బంక్ లలో పంపిణీ చేసే ఇంధనంలో ఏమేం కలుస్తున్నాయో వినియోగదారునికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. 

విచారణ సందర్భంగా పెట్రోల్ బంకు ఇచ్చిన రసీదును చూడండి, అందులో ఇథనాల్ ప్రస్తావన లేదు. తెలుసుకునే హక్కు నాకు ఉంది.. అని గోస్వామి కోర్టుకు బిల్ సమర్పించారు.

ALSO READ : ఈరోజే లాస్ట్: ఎల్‌పీజీ వినియోగదారులకు హెచ్చరిక..

వాహనాల మోడల్స్ ఆధారంగా ఏ మోడల్ కు, ఏ వెహికిల్ కు ఇంథనాల్ బ్లెండింగ్ ఎంత నిష్పత్తిలో ఉన్న ఇంధనం సరిపోతుందోననే డేటాబేస్ తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాత వాహనాలకు లేదా అధిక ఇథనాల్ మిశ్రమాలకు అనుకూలంగా లేని వాహనాలకు వాటికి సరిపోయే ఇంధనాన్ని మాత్రమే అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  సాంకేతికంగా, ఆర్థికంగా , లాజిస్టిక్‌గా సాధ్యమైన చోటల్లా తక్కువ-ఇథనాల్ పెట్రోల్‌ను అందుబాటులోకి తీసుకురావడాన్ని కూడా పరిశీలించాలని సుప్రీం కోర్టును కోరారు. 

పెట్రోలియం మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఏఆర్ఏఐ/ఐక్యాట్, వినియోగదారుల సంస్థలు, ఆటోమొబైల్ ఇంజనీర్లు, ఇంధన సాంకేతిక నిపుణులు, పర్యావరణ, ప్రజారోగ్య నిపుణులు, జలవనరుల నిపుణుల ప్రతినిధులతో ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ ప్రతిపాదించారు.

ఇథనాల్-బ్లెండింగ్ కార్యక్రమానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు. వాటిలో ఇండియాలోని ప్రస్తుత వాహనాలకు  E20 ఇంధనం అనుకూలంగా ఉందా, ఇంధన సామర్థ్యం, ఇంజిన్ లైఫ్ టైమ్,  నిర్వహణ ఖర్చులపై దాని ప్రభావం, వారంటీ, ఇన్సూరెన్స్ చిక్కులు, ఇథనాల్ ఉత్పత్తితో ముడిపడి ఉన్న టెయిల్-పైప్ ఎమిషన్స్,  నీటి వినియోగంతో సహా మొత్తం పర్యావరణ ప్రభావం, అలాగే ఇథనాల్ ఉత్పత్తితో ముడిపడి ఉన్న ఆహార భద్రత , పశుగ్రాసం మళ్లింపు ఆందోళనలు ముడిపడి ఉన్నాయని పిటిషన్ కోర్టుకు నివేదించారు. 

©️ VIL Media Pvt Ltd.