
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఉజ్జెకిస్తాన్అత్యున్నత పురస్కారం ఒలియ్దరాజాలి దోస్త్లిక్ను ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తాష్కెంట్ లో ప్రధాని మోదీని ప్రదానం చేశారు. ఇప్పటివరకు ప్రధాని మోదీ అందుకున్న 36వ అంతర్జాతీయ పురస్కారం ఇది.
ఉజ్జెకిస్తాన్ అత్యున్నత పురస్కారం లభించడం గర్వంగా ఉందన్నారు ప్రధాని మోదీ. దీనిని భారత్, ఉజ్జెకిస్తాన్ మధ్య శాశ్వత బంధానికి అంకితం ఇచ్చారు.ఈ పురస్కారం భారత్, ఉజ్జెకిస్తాన్ మధ్య బలమైన స్నేహానికి ప్రతీక, ఈపురస్కారం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గుర్తింపు అని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా భారత్,ఉజ్జెకిస్తాన్ మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. భారత్ కు యురేనియం సరఫరా చేసేందుకు ఉజ్జెకిస్తాన్ ముందుకు వచ్చింది. దీంతోపాటు రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 5బిలియన్ డాలర్లకు పెంచాలని రెండు దేశాలు నిర్ణయించాయి.
పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆగస్టు31, సెప్టెంబర్ 1 తేదీలలో 26వ షాంఘై సహకార సంస్థ(SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశాలు రెండు రోజులపాటు కిర్గిజ్ స్తాన్ లో జరగనున్నాయి.