Reading Time: < 1 minute

ఉబ్జెకిస్తాన్ 30 రోజుల బంపర్ ఆఫర్.. ఇండియన్స్కు మాత్రమే!

Caption of Image.

ఇండియన్స్ కు ఉబ్జెకిస్తాన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. విసా లేకుండా 30 రోజులు స్టే చేసే అవకాశం కల్పిస్తున్నట్లు 2026 ఆగస్టు 30న ఆ దేశ అధ్యక్షుడు షవ్ కత్ మిర్జియోయేవ్ ప్రకటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తాష్కెంట్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ తో జరిపిన చర్చల సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఉబ్జెకిస్తాన్. 

ఇండియా-ఉబ్జెకిస్తాన్ సంబంధాలు మెరుగుపర్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సదస్సులు, ఉమ్మడి సంస్థల బలోపేత,  సత్సంబంధాలు మెరుగు పడనున్నట్లు పేర్కొన్నారు. 

భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని.. గత ఏడాది బిలియన్ డాలర్ల ట్రేడ్ జరిగినట్లు ప్రెసిడెంట్ మిర్జియోయేవ్ తెలిపారు. ఇరు దేశాల సంయుక్త నిర్మాణాలు ఏడు రెట్లకు పెరిగినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ప్రతీ వారం 14 డైరెక్ట్ ఫ్లైట్స్ నడుస్తున్నట్లు తెలిపారు. 

అదే విధంగా సాంస్కృతిక సహకారంలో కూడా ఇండియా తమకు తోడ్పడుతుందని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్, మహాత్మా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ స్టడీస్ ఇరు దేశాల సాంస్కృతిక సంబంధాల అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు చెప్పారు. 

ఇండియాకు చెందిన ఫిలాసఫీ, యోగా తమ దేశంలో బాగా ప్రచారంలోకి వస్తున్నట్లు తెలిపారు. ఉబ్జెకిస్తాన్ లో యోగా ఫెస్టివల్ కూడా నిర్వహించినట్లు చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.