Reading Time: < 1 minute

సీఎం రేవంత్ రెడ్డి లేఖపై స్పందించండి : జైరాం రమేశ్

Caption of Image.
  •     ఎన్నికల సంఘానికి  జైరాం రమేశ్ విజ్ఞప్తి 

న్యూఢిల్లీ, వెలుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో అభ్యంతరాలు, క్లెయిమ్‌‌ల గడువును పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖకు తక్షణమే స్పందించాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)కి ఏఐసీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌‌ కుమార్‌‌‌‌ను కోరారు. 

ఈ ట్వీట్‌‌కు రేవంత్ రెడ్డి రాసిన లేఖను జోడించారు. ‘‘తెలంగాణలో చేపట్టిన సర్ ప్రక్రియలో ఊహించని రీతిలో ఓటర్ల తొలగింపు జరిగిందని ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సీఎం తన లేఖలో వ్యక్తం చేసిన ఈ ఆందోళనలపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలి. ఈ వ్యవహారంలో ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.