Reading Time: < 1 minute
బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. కట్ చేస్తే చివర్లో అదిరిపోయే ట్విస్ట్! వీడియో

మంచిర్యాల, ఆగస్ట్‌ 30: మంచిర్యాల జి సింల్లాగరేణి ప్రాంతంలో మద్యం మత్తులో పెరుగు కోసం పెద్ద యుద్దానికే పాల్పడ్డారు ముగ్గురు యువకులు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి పాల్పడటగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా బస్ స్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. శ్రీరాంపూర్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం..

శనివారం రాత్రి పొన్నాల ప్రశాంత్, పొన్నాల కిషోర్ అనే ఇద్దరు యువకులు శ్రీరాంపూర్‌లోని శివాజీ బిర్యానీ సెంటర్ లో బిర్యాని తినేందుకు వెళ్లారు. బిర్యానీ తింటుండగా మధ్యలో పెరుగు విషయంలో హోటల్ సర్వెంట్ అనుకుని మనుబోతుల ప్రశాంత్ అనే వ్యక్తి పెరుగు తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. మీకు నేనెలా కనిపిస్తున్నా పని మనిషిలా కనిపిస్తున్నానంటూ ప్రశాంత్ నిలదీశాడు. అంతే ఇద్దరి మద్య మాట మాట పెరిగింది. పొన్నాల ప్రశాంత్ అనే యువకుడు మనుబోతుల ప్రశాంత్ అనే వ్యక్తి పైకి‌ దాడికి దిగాడు. దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో హోటల్ యజమాని భయబ్రాంతులకు గురయ్యారు. కిషోర్ సైతం ప్రశాంత్ పైకి దాడికి రావడంతో ముగ్గురి మద్య తోపులాట జరిగింది.

ప్రశాంత్ ప్లాస్టిక్ థమ్సప్ బాటిల్ విసరడంతో మనుబోతుల ప్రశాంత్ కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరిపి సీసీ పుటేజ్ ఆదారంగా కేసులు నమోదు చేశారు. మనుబోతుల ప్రశాంత్ ఫిర్యాదు తో పొన్నాల ప్రశాంత్ , పొన్నాల కిషోర్ లపై శ్రీరాంపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పెరుగు విషయంలో గొడవ జరిగినట్టుగా గుర్తించారు. నిందితులు ఫిర్యాదుదారుడిపై చేతులతో, వాటర్, ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిళ్లతో దాడి చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు‌.

 

ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా కథనాల్లో బీర్ బాటిల్స్ తో దాడి చేసినట్లు ప్రచారం జరుగుతుందని.. అది వాస్తవం కాదని శ్రీరాంపూర్ సీఐ ఆకుల అశోక్ వివరణ ఇచ్చారు. దర్యాప్తులో లభించిన సమాచారం ప్రకారం ఫిర్యాదుదారుడిపై ప్లాస్టిక్ thumsup బాటిళ్లు , చేతులతోనే దాడి జరిగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు‌. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని సీఐ అశోక్‌ తెలిపారు.