Reading Time: < 1 minute

పాన్ షాప్ ముసుగులో మత్తు గోలీలు.. శామీర్ పేట్లో 25 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్

Caption of Image.

గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నా గుట్టుగా వ్యాపారం చేస్తున్నారు అంతర్రాష్ట్ర ముఠా. హైదరాబాద్ లో రంగుల రంగుల ప్యాకేజీలో గంజాయి చాక్లెట్లు బయట పడటం అధికారులను షాకింగ్ కు గురిచేసింది. 2026 ఆగస్టు 29న మేడ్చల్ జిల్లా, శామీర్‌పేట్ తూంకుంట చంద్రారెడ్డి కాలనీలో గంజాయి చాక్లెట్ల దందా గుట్టు రట్టు చేశారు గుట్టురట్టు చేశారు. 

ఓ ఇంటిపై దాడి చేసి బీహార్‌కు చెందిన బైద్ నాధ్ కుమార్ (29)ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 12 కవర్లలో ఉన్న 5 వేల 298 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.  అవి 24.59 కిలోలు ఉన్నట్లు చెప్పారు పోలీసులు.

నిందితుల నుంచి వివో మొబైల్ ఫోన్,  1,760 రూపాయల నగదు, సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాన్ షాప్ ముసుగులో కస్టమర్లను గుర్తించి, ఇంటి దగ్గరే గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. బీహార్ నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి తూంకుంటలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

ALSO READ : మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకుంటే… ఎమ్మెల్యే ఉండేది ఎందుకు..?

నిందితుడి భార్య పూజా కుమారి పరారీలో ఉండగా, ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్ పేట పోలీసులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.