Reading Time: < 1 minute
వరలక్ష్మీ వ్రతం చేశారు…అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

విశాఖపట్నం, గాజువాకలో జరిగిన ఒక సంఘటన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తుల అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది. పండగ పూట అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అలంకరించిన బంగారు ఆభరణాలను ఒక కుటుంబం పొరపాటున డ్రైనేజీలో పడేసింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి: విశాఖపట్నం, గాజువాకలోని శ్రీనగర్‌కు చెందిన ఉడుముల రమేష్, దివ్య దంపతులు వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను అలంకరించారు. పూజానంతరం రమేష్ కొన్ని నగలను తీసివేశారు. అయితే, పూల మధ్యలో ఉండిపోయిన ఐదు తులాల బంగారు ఆభరణాలు గమనించకుండా, పూజా సామాగ్రితో పాటు వాటిని కూడా ఎర్రటి వస్త్రంలో చుట్టి దుర్గానగర్ రైల్వే బ్రిడ్జి కింద ఉన్న డ్రైనేజీ కాలువలో పడేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత బంగారం కనిపించకపోవడంతో ఆందోళన చెందిన దంపతులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.