Reading Time: < 1 minute

ముంబై హైకోర్టు మందలింపుతో.. సిప్లా లైసెన్స్ రద్దు ఉపసంహరించుకున్న FDA

Caption of Image.

పుణెకు చెందిన  ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా లైసెన్స్​రద్దు వ్యవహారంలోFDA  తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ముంబై హైకోర్టు మందలింపుతో సిప్లా లైసెన్స్​ రద్దును ఉపసంహరించుకుంది. సిప్లా ఫార్మా కు  చెందిన పుణె క్వారీ అండ్​ ఫార్వార్డింగ్​ యూనిట్​ లైసెన్స్​ రద్దుపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం..FDA పరిధి దాటి ప్రవర్తించిందని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని మండిపడింది. ఇది న్యాయ సూత్రాలకు విరుద్దమని స్పష్టం  చేసింది. 

సెలవురోజు విచారణకు హాజరు కావాలని FDA  ఈమెయిల్​ పంపిందని, కంపెనీ ప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో  సమయం కోరినా అదే రోజు లైసెన్స్​ రద్దు చేసిందని సిప్లా వాదించింది.  దీంతో FDA అధికారులను హైకోర్టు మందలించింది. కోర్టు అక్షింతలతో  స్పందించిన FDA..  సిప్లా కంపెనీ లైసెన్స్ రద్దును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించుంది. అయితే కొత్త నోటీసు జారీ చేసి వివరణ విన్న తర్వాతే  తగిన నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపింది. 

వివాదం ఏంటంటే.. 

రియాక్టివ్ ప్లస్ టాబ్లెట్ల ప్యాకేజింగ్ , స్టోరేజీ, రికార్డుల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఆగస్టు 27 న సిప్లా పుణె యూనిట్  లైసెన్స్ ను FDA కమిషనర్​ తుకారాం ముండే రద్దు చేశారు. దీనిపై సిప్లా ముంబై కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదం నిబంధనలను ఉల్లంఘటనకు సంబంధించినదే గానీ, మందుల నాణ్యత, రోగుల భద్రతకు సంబంధించిన విషయం కాదని సిప్లా స్పష్టం చేసింది. 

©️ VIL Media Pvt Ltd.