Reading Time: < 1 minute

దొరలు పొర్లు దండాలు పెట్టినా.. మళ్లీ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే: మంత్రి పొంగులేటి

Caption of Image.

హైదరాబాద్: దొరలు పొర్లు దండాలు పెట్టినా తెలంగాణలో మళ్లీ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో రైతుల చేతులకు బేడీలు వేసిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే రైతులపై మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. శనివారం (ఆగస్ట్ 29) సూర్యాపేట జిల్లాలోని నూతన్‌కల్, మద్దిరాల మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల భూముల పట్టాలను పేద రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. 

ఈ సందర్భంగా నూతనకల్ మండలంలోని గ్రామపంచాయితీ పల్లె వనం గ్రౌండ్‎లో సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరికీ సంక్షేమ పథకాలు అందలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. 

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదలే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ధరణి స్థానంలో భూభారతి తెచ్చాక అన్ని సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే తట్టుకోలేక బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. ఆర్టీసీ ఆస్తులను ప్రజలకు పంచుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.