Reading Time: 2 minutes

లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు పిచ్చిపిచ్చిగా కొంటున్న కోటీశ్వరులు.. ఇప్పుడే ఎందుకంటే?

Caption of Image.

మన దేశంలో కోటీశ్వరులు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు ఎగబడుతున్నారు. సాధారణ కార్ల మార్కెట్‌తో పోలిస్తే.. సంపన్నుల సెగ్మెంట్‌లో లగ్జరీ ఈవీ కార్ల అమ్మకాల జోరు విపరీతంగా సాగుతోంది. 2026 మొదటి 6 నెలల్లో BMW కంపెనీ అమ్మిన ప్రతి 4 కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ వాహనమేనట. సాధారణ ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లో ఈవీల వాటా కేవలం 8-9 శాతంగా మాత్రమే ఉంటే.. లగ్జరీ సెగ్మెంట్‌లో మాత్రం ఇది ఏకంగా 3 రెట్లు అధికంగా ఉంది. జర్మనీకి చెందిన ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు ఈవీలు కొత్త గ్రోత్ ఇంజన్లుగా మారాయి.

మెర్సిడెస్ బెంజ్ జోరు.. ఏడాదికే ముగిసిన స్టాక్:
ఈ మార్పు మెర్సిడెస్ బెంజ్ అమ్మకాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. రూ.కోటి 40 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ‘టాప్-ఎండ్’ మోడళ్ల నుంచి ప్రతి 3 గంటలకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అమ్ముడవుతోంది. ఇక రూ.57 లక్షల ధర కలిగిన CLA BEV కార్లయితే 2026 కోటా మొత్తం ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోయింది. దీంతో కొత్త కొనుగోలుదారులు డెలివరీల కోసం వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కోటీశ్వరులకు లేని ఛార్జింగ్, రేంజ్ టెన్షన్లు:
సాధారణ కార్ కొనుగోలుదారులు ఛార్జింగ్ ఫెసిలిటీ, రేంజ్ ఆందోళనలు, అధిక ధరల కారణంగా ఈవీల వైపు రావడానికి వెనకడుగు వేస్తుంటారు. కానీ సంపన్న కుటుంబాలకు ఈ సమస్యలేవీ ఉండవు. ఇంటి వద్దే ప్రత్యేకమైన పార్కింగ్ స్థలంలో ఛార్జర్ ఏర్పాటు చేసుకోవడం వారికి చాలా ఈజీగా మారిందట. అంతేకాకుండా.. ఈవీ అనేది వారి ఇళ్లలో ఉన్న చాలా కార్లలో ఒకటి మాత్రమే కావడంతో దూర ప్రయాణాలపై ఎలాంటి ఆందోళన కలిగించట్లే. రోజువారీ ప్రయాణాలకు ఈవీలను వాడి, లాంగ్ ట్రిప్స్, జర్నీలకు పెట్రోల్ లేదా డీజిల్ కార్లను వాడుకుంటున్నారు. 

భారీగా తగ్గుతున్న పన్ను భారం:
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లపై జీఎస్టీ కేవలం 5 శాతం మాత్రమే ఉండగా.. పెద్ద పెట్రోల్, డీజిల్ కార్లపై 28 శాతం జీఎస్టీతో పాటు కాంపెన్సేషన్ సెస్‌ను విధిస్తున్నారు. లగ్జరీ కార్ల ధరల వద్ద ఈ పన్ను వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టాక్స్ బెనిఫిట్స్ బ్యాటరీ టెక్నాలజీ వల్ల అయ్యే అదనపు ఖర్చును భర్తీ చేస్తూ.. ఎలక్ట్రిక్, ఇంటర్నల్ కంబషన్ మోడళ్ల మధ్య ధర వ్యత్యాసాన్ని తగ్గిస్తోంది.

ALSO READ : పెట్రోల్ బిల్లులో ఇథనాల్ శాతం చెప్పాలని పిటీష

లగ్జరీ సెగ్మెంట్‌లో పోర్స్చే, వోల్వో, రోల్స్ రాయిస్, ఫెరారీ, లెక్సస్ వంటి బ్రాండ్ల నుంచి గత ఆర్థిక సంవత్సరం 13 కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో కోటీశ్వరులకు నచ్చిన బ్రాండ్, బాడీ స్టైల్‌లో ఎలక్ట్రిక్ కార్లను సెలెక్ట్ చేసుకునే అవకాశం లభించింది. టెన్షన్లు లేని డ్రైవింగ్ అనుభవం, అత్యాధునిక టెక్నాలజీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా లగ్జరీ ఈవీలు కోటీశ్వరులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయాయి. దీంతో కొత్త మోడల్ రాగానే రైటు ఎంతైనా వెంటనే కొనేస్తున్నారు భారతీయ సంపన్నులు. 

©️ VIL Media Pvt Ltd.